రీసెంట్ గా సుజాత గారు వ్రాసిన టపా యమ కూపమనే నవల గురించి. దాన్ని చూశాక తెలుగు అనువాదం చదవాలని ఒహఠే ఉబలాటం కలిగింది. రెంటాల వారు చేశారని. ఆయన అనువాదాలు నాకు బాగా ఇష్టం. పుస్తకం దొరకటం లేదని తెలిసి నిరాశ కలిగింది. ఇంతలో ప్రియ తన దగ్గర ఆంగ్ల ఈటెక్స్ట్ ఉందని చెప్పి పీడీఎఫ్ పంపింది. మనకు కథ ముఖ్యం కానీ, భాష దేముందనేది మొదటి నుంచీ నా భావన. ఆల్రెడీ చదివే పనిలో పడ్డా. అసలే ఇవాళ దాదాపూ రెణ్ణెళ్ళ తరువాత కాస్త తీరిక దొరికింది బంద్ పుణ్యమా అని. పుస్తకం దొరకలేదని నాలానే బాధపడేవాళ్ళుంటారని, దాన్ని ఇక్కడ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.
మంచి పుస్తకాలను పరిచయం చేస్తున్న సుజాత గారూ, ఇలా మంచి పుస్తకాలని పంచి ఇస్తున్న ప్రియ (ఈ మధ్య నాలుగైదు మమ్చి పుస్తకాలను పంపింది) పది కాదు కాదు పదకొండు కాలాల పాటూ చల్లగా ఏసీ రూముల్లో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ,
గీతాచార్య
పీఎస్: తెలుగు పుస్తకం ఉన్న వాళ్ళు స్కానుడో, లేదా ఫొటోశ్టాట్ కాపీలో మాలాంటి వాళ్ళకు అందించి పుణ్యం కట్టుకోగలరని ప్రార్థన. అవసరమైనచో ఫొటోశ్టాట్ కు అయిన ఖర్చునందించగలమని మనవి చేసుకుంటున్నాను.